Header Banner

హైకోర్టులో వంశీకి మరో ఎదురు దెబ్బ! కిడ్నాప్ కేసులో దర్యాప్తు అవసరం.. ముందుస్తు బెయిల్ రద్దు!

  Fri Feb 21, 2025 18:56        Politics

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ తీర్పును సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీ బెయిల్ పిటిషన్‌ను కూడా మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో వంశీ బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ , ఎస్టీ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


కస్టడీ కోసం పిటీషన్..
కాగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని.. వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


బెయిల్ నిరాకరణ..
అలాగే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించేందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #exmla #vamsi #arrest #bail #cancel #todaynews #flashnews #latestupdate